
అక్కినేని వారి కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టిన సమంత ఆ కుటుంబ గౌరవాన్ని మరింత పెంచింది. అక్కినేని కుటుంబ సభ్యులకు కధ నచ్చితే ఒకే సినిమాలో నటించేందుకు కూడా మొగ్గుచూపుతారు. అలా అందరూ కలిసి నటించిన సినిమా "మనం" బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తెలుగు చలన చిత్రంలో ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక మొన్నీమధ్యే నాగార్జున నటించిన మన్మధుడు2 లో సమంత అతిధిగా తళుక్కుమంది. ఇప్పుడు మరోసారి సమంత వారి కుటుంబ సినిమాలో అతిథిగా కనిపించబోతుందట. అదే...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ నాలుగోవ సినిమాలో సమంత అతిథిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అఖిల్ సమంతాకే కధ చెప్పడంతో సినిమా మొదలవుతుందట. మరి వదినా, మరిది తెరపై ఎలా ఉంటారో చూడాలి.