
మరోసారి సమంత అక్కినేని హరర్ డ్రామాలో నటించబోతోంది. ఇదివరకు నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన హర్రర్ కామెడీ-డ్రామా "రాజు గారి గాది 2" లో సమంత ఇప్పటికే దెయ్యం పాత్రను పోషించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత అక్కినేని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో తెలుగులో ఆమె తదుపరి చిత్రం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంది. ఒక సినిమా కోసం సమంత అశ్విన్ శరవన్తో కలిసి పనిచేయబోతోందని ఇప్పటికే తెలిసిన విషయమే. నిన్న ఎవరో ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు, “మొదటిసారి, అశ్విన్ శరవన్ దర్శకత్వం వహించనున్న ఫుల్ లెంగ్త్ హర్రర్ థ్రిల్లర్లో సమంత నటిస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇది ఆమె మొట్టమొదటి బోనఫైడ్ హర్రర్ చిత్రం! ” అని ట్వీట్ చేశారు. దీనికి సమంత అక్కినేని, "ఇది కేవలం హర్రర్ చిత్రమే కాదు అంతకంటే ఎక్కువ ఉంటుంది" అని సమాధానం ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఇటు తెలుగులో, అటు తమిళ్ లో తెరకెక్కించనున్నారు.