
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని అందమైన మరియు ప్రతిభావంతులైన నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఆమె తన కెరియర్ లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఒక సినిమా బాధ్యతను ఆమె భుజంపై మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నటీమణులలో సమంత ఒకరు. ఆమె ఇటీవల నటించిన రొమాంటిక్ మరియు ఎమోషనల్ డ్రామా "జాను" బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయింది, కానీ ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. జాను ఫెయిల్యూర్ పై సమంత అక్కినేని మొదటిసారి నోరు విప్పింది. తాజాగా ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించిన సమంత, ఓ ఫ్యాన్ అన్న మాటకు సమాధానంగా "బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా, జాను చిత్రం నన్ను చాలా మార్చింది. నేను నా కళకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకున్నాను మరియు దాని కోసం నేను ఎల్లప్పుడూ జాను చిత్రానికి కృతజ్ఞతతో ఉంటానని" చెప్పుకొచ్చింది.