
శర్వానంద్, సమంతా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'జాను'కు టాలీవుడ్లో చాలా హైప్ ఏర్పడింది. ఇది ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం, ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన జాను పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బృందం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. జాను చిత్రం కూడా మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోందని చెప్పక తప్పదు. తాజా సమాచారం ప్రకారం, శర్వానంద్ మరియు సమంత అక్కినేని నటించిన జాను యొక్క విదేశీ హక్కులకు 2 కోట్ల రూపాయిలు వచ్చినట్లు తెలుస్తోంది. జాను విదేశీ హక్కులను ప్రైమ్ మీడియా సొంతం చేసుకుంది. దిల్ రాజుకు ఇది చాలా మంచి డీల్ అన్నట్టే. నిన్న జాను మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేసింది. దీనికి అక్కినేని అభిమానుల, సినీ ప్రేమికుల నుండి మంచి స్పందన లభించింది. జాను చిత్రంను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.