
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సమంత అక్కినేని టాప్ హీరోయిన్లలో ఒకరు. ఈ ఏడాది సమంత తన అభిమానులను, చలన చిత్ర ప్రేమికులను రొమాంటిక్ డ్రామ "జాను"తో ఫిబ్రవరి 7వ తేదీన పలకరించనుంది. ఇటీవలే జాను మేకర్స్ సినిమా ప్రమోషన్లలో జోరు పెంచింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత పలు విషయాలను వెల్లడించారు. నిర్మాత దిల్ రాజు తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ '96'ను తెలుగు రీమేక్ కోసం సమంతను సంప్రదించాలనుకునప్పుడు సమంత అతన్ని కలుసుకునేందుకు కూడా భయపడిందట. అందుకే తన మ్యానేజర్ తో దిల్ రాజు గారు అడిగితే నేను లేనని చెప్పమనిందట. ఓ బేబీ ఫేం నటి సమంత మాట్లాడుతూ, "నిర్మాత దిల్ రాజు నన్ను మొదటిసారిగా సంప్రదించినప్పుడు, నేను ఈ రీమేక్ చేయలేనని చెప్పాను. కానీ నన్ను రెండో సారి అడుగుతున్నందుకు దిల్ రాజు గారికి కృతజ్ఞతలు చెప్తునాని" అన్నారు.