
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఆమె నటిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి, కానీ సామ్ తాజా చిత్రం 'జాను' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. రొమాంటిక్ మరియు ఎమోషనల్ డ్రామా జాను తమిళ చిత్రం 96 యొక్క రీమేక్. సమంత జాను పాత్రను పోషించారు. అయితే ప్రేక్షకులు ఈ చిత్ర పరాజయానికి సమంత కారణమని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె ఫ్లాప్ హీరోయిన్ అంటూ కామెంట్లు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా వచ్చి.... ఒక సినిమా పరాజయానికి, అందులో పని చేసిన నటిని నిందించడం న్యాయం కాదని అన్నారు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, సమంత అక్కినేని, ఫ్లాప్ హీరోయిన్ అన్న మాటపై కామెంట్ చేశారు. "అదే, స్టార్ హీరో సినిమా మూడు సార్లు ఫ్లాప్ అయినా...నాలుగోసారి వెళ్లి చూస్తారు. వాళ్లకి తమ అభిమాన నటుడు కేవలం నడిచిన చాలు...కానీ ఇక్కడ ఫ్లాప్ కి హీరోయిన్ కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు' అని తన అసంతృప్తిని తెలియజేశారు.