
అక్కినేని జంట నాగచైతన్య-సమంతను టాలీవుడ్ హాట్ అండ్ హ్యాపేనింగ్ కపుల్ అని అనాల్సిందే. పెళ్లై ఇన్నేళ్లు గడిచినా ఈ ఇద్దరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహ పడతారు. తాజాగా టాలీవుడ్ హాంక్ రానా దగ్గుబాటి పెళ్లి కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి కార్యక్రమాలన్నిటిలో పాల్గొన్నారు చై-సామ్. అయితే తాజాగా ఒక ఈవెంట్ లోని తమ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత నవ్వుతూ ఎవరితోనో సంభాషిస్తుండగా వెనకాల నిల్చున్న నాగచైతన్య ఆమెపై అక్షింతలు వేస్తున్నాడు. ఈ ఫోటో పెట్టడం ఆలస్యం లక్షల లైకులు, వేల షేర్లతో దూసుకుపోతుంది. ఎంతైనా భలే చూడముచ్చటగా ఉంటారు జంట!