
సమంత నుండి అక్కినేని సమంతగా మారి విజయాలను తనతో పాటు అక్కినేని కుటుంబానికి తీసుకొచ్చిన నటి. టాలీవుడ్ లో ఎక్కువ హిట్స్ తో టాప్ హీరోయిన్ జాబితాలో మొదటి స్థానంలో కనసాగుతుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక సమంత కధల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకు గ్లామర్ పాత్రలైన సరే చేసే సమంత ఇప్పుడు నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. అలా ఎంచుకున్న వాటిలో "రంగస్థలం, యూ టర్న్, మజిలీ, ఓ బేబీ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాయి. నటిగా ఆమెను మరో మెట్టు ఎక్కించాయి. అయితే సమంతాకు కానీ నాగచైతన్యకు కానీ ఏదైనా విజయం వస్తే చాలు వెంటనే తిరుమల వెంటేశ్వర స్వామిని కాలినడకన దర్శించుకుంటుంది. తాజాగా బుధవారం రాత్రి సమంత అలిపిరి మెట్ల మార్గం ద్వారా తమిళ నటి రమ్య సౌందర్యన్ తో కలిసి తిరుమల చేరుకుంది. అనంతరం గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుంది. కాలినడకన వెళ్లే సమయంలో సమంతను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఇంతకీ ఈసారి దర్శనంకు కారణం వెంకీ మామ సక్సెసేనా ?