
ఇద్దరు ఇద్దరే! టాలీవుడ్లో పెళ్లైన కూడా టాప్ హీరోయిన్ గా నటనకు ప్రాధాన్యత ఇస్తూ దూసుపోతున్న అక్కినేని కోడలు సమంత ఒకవైపు అయితే....ఇప్పుడిప్పుడే వచ్చినా వరుస విజయాలతో మంచి ట్రాక్ రికార్డుతో హాట్ కేక్ లా దూసుకుపోతున్న భామ రష్మీక మరొకవైపు. ఈ ఇద్దరు ఒకే సినిమాలో కనిపించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల కానున్న సినిమాలో సమంత-రష్మీక అక్కా చెల్లెల్లుగా నటించనున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్నికి ఓ తమిళ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడాని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.