
ఈమధ్యకాలంలో రీమేకుల హవా బాగా పెరిగింది. సౌత్ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేయటం.. హిందీలో హిట్ అయిన సినిమాలను సౌత్ లో రీమేక్ చేయటం మాములు అయిపోయింది. ఈ క్రమంలో నటి సమంత నటించిన తెలుగు-తమిళ సినిమా "యూ టర్న్" మంచి విజయాన్ని సాధించింది. నటన పరంగా సమంతకు పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయట. ఎవరైతే బాగుంటారని ఆలోచించిన బృందం సమంతానే న్యాయం చేస్తుందని ఆమెను హిందీ రీమేక్ లో నటించమని అడగగా....దానికి ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణాదిలో ఎంతో సంతోషంగా ఉన్నానని ఇప్పట్లో హిందీలో నటించే ఆసక్తి లేదని తేల్చి చెప్పిందట. దీంతో చేసేదేంలేకా సమంత స్థానంలో తాప్సిను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇక గతంలో కూడా సమంత హిందీ సినిమా అవకాశాలను తిరస్కరించడం జరిగింది.