
టాలీవుడ్ లో ఇప్పటికి మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరు అంటే అందరి నోటా వినిపించే పేరు అక్కినేని నాగచైతన్య-సమంత. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. చైతూ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ లేకపోయినా సమంత మాత్రం నిత్యం తమ జీవితాల్లో ఎం జరుగుతుందో ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా అభిమానులతో ముచ్చటించిన సామ్ ను ఒక అభిమాని మీరు జిమ్ కు వెళ్లడం ఎప్పుడు మొదలుపెట్టారు అని అడగగా....'మీ అందరికి ఒక టాప్ సీక్రెట్ చెబుతాను. నేను అసలు జిమ్ మొదలుపెట్టింది చైతూ కోసం. తను ఆ జిమ్ కు ఎక్కువగా వస్తుండేవాడు దీంతో అతన్ని చూడటానికి నేను వెళ్లేదాని' అని సమాధానం ఇచ్చింది. మొత్తానికి సామ్ కూడా సినిమాల్లో లాగ ఒక మంచి తుంటరి లవ్ ట్రాక్ నడిపిందని నెటిజన్లు అనుకుంటున్నారు.