
తెలుగు ఇండస్ట్రీలో రీమేక్‌ల హవా బాగా పెరిగిపోయింది. ఏ బాషా లోనైనా సరే ఒక సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయం సాధించిందంటే చాలు దాని రీమేక్ చేసేందుకు నటి, నటులు, నిర్మాతలు రెడీగా ఉంటున్నారు. అలా గత ఏడాది అక్టోబర్ లో తమిళంలో రిలీజ్ అయిన "96" భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. తమిళ్ '96'ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా... తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఫస్ట్ లుక్ చూస్తే... ఎడారిలో ఒంటెలు, వాటికి ఎదురుపడుతూ బ్యాగ్ వేసుకోని శర్వానంద్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంది. "జాను" అనే టైటిల్ తో సినిమా రానుంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని మార్చ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.