
బిగ్ బాస్ సీజన్ 4 ముందు సీజన్లతో పోలిస్తే కాస్త చెప్పగానే సాగిందని చెప్పాలి. 24 గంటల్లో టీంకు ఆసక్తిగా ఉండే గంట కంటెంట్ దొరకట్లేదంటే షో ఎలాంటి పరిస్థితిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అలాంటి షోకు ఏదైనా మర్చిపోలేని ఎపిసోడ్ అలానే భారీ టిఆర్పి వచ్చిన ఎపిసోడ్ ఉందా అంటే అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేసిన దసరా మహా ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్ ఇంకా పూర్తి కాకముందే వచ్చే సీజన్ హోస్ట్ గురించి పుకార్లు మొదలయ్యాయి. సీజన్ 5 కి హోస్ట్ గా అక్కినేని కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్ సమంతనే కనిపించబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక్క రోజు సీఎం లా ఒక్క రోజు హోస్ట్ గా వచ్చి మ్యాజిక్ చేసిన సామ్ మరి ఫుల్ టైం హోస్ట్ గా చేస్తుందా లేదా అనేది వచ్చే ఏడాది వరకు ఆగితే తెలుస్తుంది.