
స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తన విజయవంతమైన కెరీర్ నుండి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. రిటైర్మెంట్ తీసుకోని మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించి, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించాలని ఫిక్స్ అయింది. సామ్ తాజాగా నటించిన రొమాంటిక్ డ్రామ, "జాను" ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన కెరియర్ ప్లానింగ్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది. మీడియాతో సంభాషించిన సమంత, రాబోయే రెండు, మూడు సంవత్సరాలు మాత్రమే సినిమాల్లో నటిస్తానని తెలిపింది. “నేను వివాహం చేసుకున్నాను. నా కుటుంబం గురించి ఆలోచించాలి. అంతేకాకుండా, హీరోయిన్ కెరీర్ చాలా చిన్నదని మనందరికీ తెలుసు. అందుకే నేను ఇంకా 2, 3 సంవత్సరాలు నటించగలను ”అని సమంత అన్నారు. కాబట్టి, తన రాబోయే ప్రాజెక్టులన్నీ తనకు, ఆమె అభిమానులకు చాలా కాలం పాటు చిరస్మరణీయంగా ఉంటాయని సమంత హామీ ఇచ్చారు.