
అక్కినేని కోడలు సమంత ట్యాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏంలేదు. సినిమాలతో పాటు తాజాగా వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టిన నటి ఈమధ్యనే బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. అంతేకాకుండా అందరికి షాక్ ఇస్తూ యాంకర్ గా కూడా మారింది. అది కూడా బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే నాగ్, తన సినిమా 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం కొన్ని వారాలు విదేశాలకు వెళ్లారు. దీంతో అతని బాధ్యతలను సమంతకు అప్పగించారు నాగార్జున. ఎలా చేస్తుందో? తెలుగు స్పష్టంగా రాదూ, ఇది వరకు యాంకర్ గా అనుభవం లేదు అనుకున్న వారు ముక్కు మీద వెళ్ళేసుకునేలా రఫ్ ఆడించింది అక్కినేని కోడలు. ఆమె హోస్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇకపై కూడా సమంత వస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.