
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత అక్కినేని చేసినన్ని ప్రయోగాలు మరే హీరోయిన్ చేసి ఉండదేమో. కమర్షియల్ సినిమాలు చేసినన్ని రోజులు చేసి పేరు, సంపాదన దక్కించుకున్నాక ప్రయోగాలు చేయటం మొదలు పెట్టింది. కధకు ప్రాధాన్యం ఉంటే చాలు ఎలాంటి రోల్ అయినా ముందుకి దూకుతుంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ తాజాగా హోస్ట్ గా కూడా మారిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో ఒక్క రోజు హోస్ట్ గా వచ్చి దుమ్ము రేపిన సమంత తాజాగా ఆహా ఓటిటిలో 'సామ్ జామ్' అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత కోసమైనా ఈ యాప్ ఓపెన్ చేస్తున్న వారు ఉన్నారు. అయితే సమంత ఈ షోకు గాను వారానికి కోటి రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. మొదట కోటి కన్నా ఎక్కువ అడిగినప్పటికీ మొదటి సీజన్ తర్వాత పెరుగుతుందని నిర్వాహకులు చెప్పినట్లుగా తెలుస్తుంది.