
అక్కినేని సమంత..నాగచైతన్య భార్య, నాగార్జున కోడలు రాజా రవి వర్మ చిత్రంలో ఎంత అందంగా ఉందో చూశారా? విషయం ఏమిటంటే...సమంత అక్కినేని రాజా రవివర్మ గీసిన చిత్రాలలో ఒకదాని రూపాన్ని నేటి నటిమణులతో మళ్ళీ సృష్టించబడ్డాయి. ఈ ఫోటోషూట్‌ను ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ 2020 క్యాలెండర్ కోసం చేశారు. ఈ ఫోటోషూట్ నుండి ఆమె చిత్రాన్ని సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నామ్ ఫోటోషూట్ లో సమంత లుక్ చూసి వారెవ్వా అనక తప్పదు. శ్రుతి హాసన్, ఖుష్బూ, ఐశ్వర్య రాజేష్, రమ్య కృష్ణ, లక్ష్మి మంచు కూడా 2020 క్యాలెండర్ యొక్క ఫోటోషూట్‌లో పాల్గొని వారి చిత్రాలను సోషల్ మీడియా సైట్లలో పంచుకున్నారు. రాజా రవివర్మ చిత్రలేఖనంపై స్పెషల్ ఎడిషన్ క్యాలెండర్ ను ప్రదర్శించనున్నారు ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్. వెంకట్ రామ్ తన క్యాలెండర్ కోసం తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.