
ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అక్కినేని సమంత ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. తన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సరసన నటిస్తూ తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలు చేసిన సామ్ నాగచైతన్యతో పెళ్లి తర్వాత కధకు ప్రాముఖ్యత ఉండే పాత్రలను ఎంచుకుంటుంది. మజిలీ, ఓ బేబీ, యూ టర్న్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు హోస్ట్ గా అవతారం ఎత్తింది. అయితే ఇవన్నీ కాకుండా బాగా హిట్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నెగిటివ్ షెడ్ లో సమంతను చూసి ఏ హీరోయిన్ అయిన సమంత రూట్ ఫాలో అవ్వాల్సిందేనని టాక్ వినిపిస్తుంది. ఆ రేంజ్ లో సామ్ పాత్ర ఆ పాత్రకు తన పర్ఫామెన్స్ ఉందట.
Tags: #Cinecolorz #SamanthaAkkineni