
గత వీకెండ్ బిగ్ బాస్ షో హోస్ట్ గా మామ అక్కినేని నాగార్జున బాధ్యతను కోడలు సమంత అక్కినేని తీసుకొని హోస్ట్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అది కూడా దసరా అవ్వడంతో మరింత స్పెషల్ గా బిగ్ బాస్ షో మూడు గంటల పాటు ప్రసారమైంది. ఇంటి సబ్యులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో నడిపించింది. నటనతో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సామ్ బిగ్ బాస్ షో హోస్ట్ చేసి యాంకరింగ్ లో కూడా తను క్వీనేనని నిరూపించుకుంది. ఇదంతా ఒకెత్తు ఆ ఎపిసోడ్ కు సమంత కట్టుకున్న చీర ఒకెత్తు. ఎందుకు అంటారా....ఆమె కట్టిన ఎర్ర రంగు చీరనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఆ చీర ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ. 5 లక్షలు. గొప్ప విదేశీ డిజైనర్లచే డిజైన్ చేయబడిన ఈ చీర సమంత కట్టుకొని దానికి మరింత వన్నె తెచ్చింది.