
సందీప్ రెడ్డి వంగా మరోసారి తండ్రి అయ్యారు. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ ఆడపిల్లకి తండ్రయ్యారు. అతని భార్య ఈ రోజు మధ్యాహ్నం పండంటి ఆడపిల్లకు జనమనిచ్చింది. తాజా సమాచారం ప్రకారం, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా తెలుగు పరిశ్రమకు 'అర్జున్ రెడ్డి'తో పరిచయం అయ్యారు. ఇందులో యువ నటుడు విజయ్ దేవరకొండ మరియు శాలిని పాండే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 'కబీర్ సింగ్' పేరుతో 2019 లో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలుగా అర్జున్ రెడ్డి యొక్క హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించారు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమాపై స్పష్టత లేనప్పటికీ, బాహుబలి స్టార్ ప్రభాస్ ను మంచి కథతో మెప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు మహేష్ తో సినిమా తీద్దామనుకున్నప్పటికి, పలు కారణాల వల్ల ఆ ప్రయత్ననాన్ని పక్కన పెట్టేసారు. మరి ఏ స్టార్ హీరోతో తన తదుపరి సినిమా తిస్తాడో చూడాలి.