
తమ డిమాండ్లను తీర్చాలంటూ 52రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, జేఏసీ మధ్య ఎన్ని చర్చలు జరిగిన ఫలితం లేకపోయింది. మేము ఒక మెట్టు దిగుతున్నామంటూ ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ...సమ్మెను విరమించినట్లు జేఏసీ ప్రకటించింది. కార్మికులను డిపోలకు వెళ్లాల్సిందిగా జేఏసీ చెప్పగా...డిపోలకు భారీగా చేరుకుంటున్నారు కార్మికులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదంటూ ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. , సంగారెడ్డి డిపో వద్ద విధుల్లోకి చేరేందుకు కార్మికులు యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.