
బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఆగస్టు 8న ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. కోలుకుని ఆరోగ్యంగా ఆగస్టు 10న డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చారనుకున్న అభిమానులకు మరొక షాకింగ్ వార్త తగిలింది. సంజయ్ స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసింది. బాబా, తన ట్విట్టర్లో సినిమాల నుండి స్వల్ప విరామం తీసుకుంటానని, ఆందోళన చెందవద్దని స్నేహితులు మరియు అభిమానులను కోరారు. ఈ వార్తతో బి టౌన్ తో పాటు ఫ్యాన్స్ కు కూడా పెద్ద షాక్ లో ఉన్నారు. అయితే చికిత్స నిమిత్తం సంజయ్ దత్ త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇది తెలిసిన మరుక్షణం ప్రముఖ నటులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా సంజు బాబా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.