
వచ్చే వారంలో వరుసగా నాలుగు రోజులు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు, రష్మీక జంటగా వస్తున్న "సరిలేరు నీకెవ్వరు". సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది.ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ను తెచ్చి అంచనాలను పెంచాయి. అయితే పెరిగిన అంచనాలు, పాజిటివ్ బజ్ రిజల్ట్ కలెక్షన్స్ మీద బాగానే కనిపించనుంది. యూఎస్ లో మహేష్ కు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ప్రీమియర్ షోస్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. యూఎస్ అన్ని సెంటర్లు కలిపి 400 వేల డాలర్లు కలెక్ట్ చేసిందట. ఈ లెక్కన చూస్తే మొదటి రోజే మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.