
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ ఆల్బమ్ నుండి భార్య నమ్రతా ఫోటో ఒకటి తీసి ఆమె పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్లో షేర్ చేసి, "విషింగ్ ది ఉమెన్ ఆఫ్ ది హౌస్, లవ్ ఆఫ్ మై లైఫ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు !!! కేవలం ప్రేమ మరియు మరింత ప్రేమ నమ్రత. " అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. మహేష్ పెట్టిన పోస్ట్ కు మాజీ నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ వెల్లువెత్తాయి. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రియమైన జంటల్లో మహేష్ నమ్రత ఒకరు. వారు 2005 లో వివాహం చేసుకోని ఇద్దరి పిల్లలు గౌతమ్, సితారాకు తల్లిదండ్రులు అయ్యారు. మహేష్ బాబు, నమ్రత మొదటిసారి ఒకరినొకరు కలుసుకున్నారు వంశీ సెట్లో కలుసుకున్నారు. అప్పటి నుండి ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2005 లో మూడు ముళ్లతో ఒకటయ్యారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలితో సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.