
బిగ్ బాస్ సీజన్ 4 మునపటి సీజన్ల కంటే సక్సెస్ఫుల్ గా సాగుతుంది. కానీ ఎక్కడో ఓట్ల విషయంలో యాజమాన్యం ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆదుకుంటుందని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లో అభిజీత్, అవినాష్, దివి, అరియానా, నోయెల్, మోనాల్ ఉన్నారు. వీళ్లందరిలో డేంజర్ జోన్ లో మాత్రం నోయెల్, మోనాల్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గత వారం కూడా మోనాల్ కు ఓట్లు తక్కువ వచ్చినా కావాలనే కుమార్ సాయిను ఎలిమినేట్ చేసారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వారం మోనాల్ ఇంటి నుంచి వెళ్లకపోతే ఉరుకునేలా లేరు నెటిజన్లు. మరోపక్క రెండు మూడు వారల నుంచి నోయెల్ సరిగ్గా ఆడటం లేదనే అభిప్రాయం వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉంటారో? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో? చూడాలి.