
టీవీ 9 ఔట్పుట్ ఎడిటర్ అజయ్ ఆజాద్, ఈ నెలలో రెండు రోజులలోపు తనతో పని చేస్తున్న ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేయటంతో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుల ప్రకారం, అజయ్ ఆజాద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిని బెదిరించాడని ఆరోపించారు. ఫిర్యాదు దారులు అజయ్ ఆజాద్ తమకు అసభ్యకరమైన సందేశాలు పంపారని ఆరోపించారు. అంతేకాదు వారి కెరీర్ బాగుండాలి అంటే బదులుగా కొన్ని ఫేవర్స్ కోసం అభ్యర్థించారని ఆరోపించారు. మనం హోటల్ రూమ్ ఒకటి తీసుకోవచ్చని అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఇన్నిరోజులు ఛానెల్ పరువు, జర్నలిజం మీద ఉన్న గౌరవం, మా ఆత్మాభిమానం కోసం సైలెంట్ గా ఉన్నాము. కానీ దాన్నీ అవకాశంగా తీసుకొని ఆయన మరింత అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఫిర్యాదు చేశామని తెలిపారు.