
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "వరల్డ్ ఫేమస్ లవర్" తన కెరీర్లో మరో ప్లాప్ గా ముగుస్తుంది. వరల్డ్ ఫెమస్ లవర్ అంచనాలకు అనుగుణంగా ఆడలేదు. అందుకే విజయ్ దేవరకొండకు రెండు వరుస ఫ్లాప్‌ల తర్వాత ఇప్పుడు హిట్ ఎంతో అవసరం. విజయ్ దేవరకొండ ఈ ఫలితాన్ని పక్కన పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సెట్స్‌లో చేరారు. ఈ చిత్రం షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది మరియు ఇప్పటికే ముంబైలో ఒక షెడ్యూల్ పూర్తయింది. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా రిలీజ్ అయినందున, విజయ్ ముంబైలో జరుగుతున్న రెండవ షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. నేడు, హీరోయిన్ అనన్య పాండే ఈ చిత్ర సెట్స్ లో చేరారు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని" పూరి చెప్పారు. మరోవైపు విజయ్ దేవరకొండ అనన్యను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకు స్వాగతించాడు. అదే విధంగా అనన్య విజయ్ ను బాలీవుడ్ కు స్వాగతించింది.