
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డితో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఇక కెరియర్ కష్టమే అనుకున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కింది. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. అదేంటంటే....షాలిని ప్రస్తుతం అగ్ని సిరగుకల్ అనే తమిళ్ సినిమాలో నటిస్తుంది. కానీ హఠాత్తుగా వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుందట. దీంతో 27రోజుల పాటు సినిమా షట్ చేసి ఇప్పుడు అర్ధాంతరంగా ఎలా తప్పుకుంటుందని అగ్ని సిరగుకల్ ప్రొడ్యూసర్ టి శివ షాలినిపై కేసు నమోదు చేశారు. రణ్వీర్ సరసన నటించే అవకాశం వచ్చింది కాబట్టే ఆమెకు సౌత్ సినిమాలపై ఆసక్తి పోయిందని...అందుకే ఇలా హఠాత్తుగా తప్పుకుందని వాపోయారు శివ. మరి షాలిని తప్పుకోవడం వెనుక అసలు కారణం ఇదేనా ? వేరే ఏమైనా ఉందా తెలియాల్సి ఉంది.