
తాజాగా కోలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ శంకర్ కు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతుంది. పెద్ద బ్రేక్ తరువాత అయన మళ్ళీ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. శంకర్ తన సినిమాలకు సిక్వెల్లు తీస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోబోకు 2.O అంటూ సిక్వెల్ తీసిన శంకర్ కమల్ హస్సన్ తో భారతీయుడు సినిమాకు సిక్వెల్ గా ఇండియన్2 ప్రారంభించారు. దానికి కరోనా పుణ్యమా అని బ్రేక్ పడింది. అయితే, ఈ బ్రేక్ టైంలో శంకర్ మరో పెద్ద సినిమా సిక్వెల్ కు ప్లాన్ చేశారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఆ సినిమా మరేదో కాదు, అర్జున్ నటించిన 'ఒకే ఒక్కడు'. అయితే ఈ సిక్వెల్ లో అర్జున్ ప్లేస్ లో విజయ్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ 2 షూటింగ్ ముగించి ఈ సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.