
శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఇప్పటికి ఆల్ టైం ఫెవరెట్ సినిమాల్లో ఒకటి. అయితే ఈ సినిమా చూసిన ఎవరైనా ఖుర్చిలో చిరంజీవికి పేషేంట్ గా పరిచయమయ్యే బూరెబుగ్గల బుడ్డోడిని ఎవరు మర్చిపోలేరు. సినిమాలో ఆ బుడ్డోడి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బలమైనది. 'శ్రీ రామచంద్రమూర్తి' పాత్రతో అల...అందరికి గుర్తిండిపోయాడు. అయితే ఆ బుడ్డోడు మరెవరో కాదు చిరు చిన్న మెన్నల్లుడు అంటే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. అవును అతనే ఇప్పుడు 'ఉప్పెన' సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. అప్పుడు చూసి ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేసాడే అనుకున్నాం కానీ అతనే నేటి మెగా హీరో వైష్ణవ తేజ్ అని సుమారు చాలా మందికి తెలియకపోవచ్చు.