
వచ్చే నెల నుండి థియేటర్లు తెరవచ్చు తెరవకపోవచ్చు. ఈ నెల పూర్తయ్యే దశలో ఉన్నప్పటికీ, దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. ఇప్పటికే, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, థియేటర్స్ అసోసియేషన్ పరిమిత సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను తెరవడానికి అనుమతించమని పలుసార్లు ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశాయి. మరి ఈసారి ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి. అయితే, చిత్రనిర్మాతలు థియేట్రికల్ విడుదల కోసం వేచి ఉండాలా లేదా ఓటిటిలో విడుదల చెయ్యాలా అనే విషయంపై మధనపడుతున్నారు. కొంతమంది చిత్రనిర్మాతలు థియేటర్లు తెరవడం ఇప్పట్లో సాధ్యం కాదని భావించి ఓటిటి విడుదలలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే నాని వి రిలీజ్ కాగా అనుష్క యొక్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ యొక్క ఒరేయ్ బుజ్జిగా అక్టోబర్ లో ఓటిటిలో విడుదలవుతున్నాయి. అయితే తాజాగా శర్వానంద్ కూడా ఐ భాట పడుతున్నట్లు సమాచారం. శ్రీకరమ్ చిత్రంలో శర్వానంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూట్ చివరి దశలో ఉంది. శర్వానంద్ ఈ చిత్రాన్ని అక్టోబర్లో పూర్తి చేసి నవంబర్ లో ఓటిటిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ చూడాలి.