అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన శర్వానంద్, సమంత: ‘జాను’ ట్రైలర్ ఔట్
3 years ago 1 min read

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జాను' ట్రైలర్ ను చెప్పిన టైంకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తే శర్వానంద్, సమంతలు అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన్నట్లు అర్ధం అవుతుంది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ మేకర్స్ ఈ చిత్రంలో ఉన్న మ్యాజిక్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ట్రైలర్ లో సమంత, శర్వానంద్ ల మధ్య అందమైన బంధాన్ని కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరియు విజువల్స్ సాధ్యమైనంత వాస్తవంగా ఉంచబడ్డాయి. సామ్ మరియు శర్వా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది, ఇద్దరు నటులు తమ కెరీర్-బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. సమంత తన పాత్రలో సూపర్ గా ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. ఇక శర్వానంద్ నటన అబ్బురపరిచేలా ఉంది. గోవింద్ వసంత సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.