
కరోనా లాక్డౌన్ పుణ్యమాని టాలీవుడ్ మోస్ట్ ఎలీజుబుల్ బ్యాచ్లర్స్ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు. మొదట యంగ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ తో మొదలై ఆ తరువాత వరుసగా హీరో నితిన్, బల్లాలదేవుడు రానా దగ్గుబాటిలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరో విశేషం ఏమిటంటే నితిన్, రానా రామ్ చరణ్ కు మంచి స్నేహితులు. రానా వెడ్డింగ్ కు చరణ్ దంపతులు వెళ్లి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు చెర్రీ మరో స్నేహితుడి పెళ్లికి బీజం వేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు దగ్గరి బంధువుతో శర్వా కొంతకాలంగా ప్రేమల్ ఉన్నాడట. అందుకే శర్వానంద్ ప్రేమ, పెళ్లి గురించి అతని ఇంట్లో వాళ్ళతో అలాగే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లతోను మాట్లాడి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయమని చెప్పాడట. రామ్ చరణ్ మాత్రం తన స్నేహితుల పెళ్లి వ్యవహారాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.