
మార్చ్ 6వ తేదీన యంగ్ హీరో శర్వానంద్ తన పుట్టినరోజును జరుపుకుంటాడు. ఈ సందర్భంగా, అతని తదుపరి చిత్రం ప్రకటించబడింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ పై సుధాకర్ చెర్కురి నిర్మాణంలో తిరుమల కిషోర్ దర్శకత్వంలో శర్వా హీరోగా ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. తిరుమల కిషోర్, శర్వానంద్ కలిసి పని చేయటం ఇదే మొదటిసారి. అయితే ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. పడి పడి లేచేమనసు తరువాత నిర్మాత సుధాకర్ చెర్కురితో శర్వానంద్ యొక్క రెండవ ప్రాజెక్ట్. అయితే ఈ సినిమా హీరోయిన్ కోసం ఫిదా ఫెమ్ సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు. గతంలో పడి పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన విషయం తెల్సిందే. అన్ని కుదిరితే మరోసారి ఈ జంట స్క్రీన్ పై రొమాన్స్ చేయనున్నారు. కిషోర్ ప్రస్తుతం రామ్ నటించిన రెడ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. మరోపక్క సాయి పల్లవి సైతం నాగ చైతన్యతో 'లవ్ స్టొరీ' సినిమాలో బిజీగా ఉంది.