
కాస్టింగ్ కౌచ్ బెడద కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. భారతదేశం అంతటా పలువురు సినీ ప్రముఖులు బాధితులయ్యారు. కొందరు ప్రముఖులు ఈ నేరానికి పాల్పడ్డారు కూడా. ఇప్పుడు, ప్రముఖ తమిళ హీరో శరత్‌కుమార్ కుమార్తె, ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని, అయితే ‘లేదు’ అని గట్టిగా చెప్పడం ద్వారా తప్పించుకోగలిగానని, ఆమె దగ్గర “రుజువులు” కూడా ఉన్నాయని వరలక్ష్మి అన్నారు. "నా దగ్గర ఫోన్ లో జరిగిన సంభాషణలు ఉన్నాయి. అక్కడ వారే నేను రాజీపడనని అన్నారు." వరలక్ష్మి శరత్‌కుమార్ కాస్టింగ్ కౌచ్‌కు నో చెప్పడం వల్ల ఆమె ఆఫర్లు కోల్పోయానని చెప్పారు. వరలక్ష్మి ప్రస్తుతం సుందీప్ కిషన్ మరియు లావణ్య త్రిపాఠి యొక్క ఎ1 ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తున్నారు.