
రొమాంటిక్ చిత్రం 'హిప్పీ' లో కార్తికేయతో నటించిన 'దిగంగన సూర్యవన్శీ' పవన్ తో నటించాలని ఉందని బహిరంగంగా చెప్పారు. ఇటీవల దిగంగన సూర్యవన్శీ మీడియాతో ముచ్చటించారు. ఆ సందర్భంలో ఆమె వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల గురించి ఓపెన్ గా చెప్తూ తన మనసులోని మాట బయట పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ స్పెస్ పంచుకోవాలన్న కోరికను బయట పెట్టారు. హిప్పీ నటి మాట్లాడుతూ, ”పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు! అతను నటుడు మాత్రమే కాదు, గాయకుడు, కొరియోగ్రాఫర్ మరియు రాజకీయవేత్త కూడా. పవర్ స్టార్‌తో ఉన్న వ్యక్తులలో అపారమైన విశ్వాసాన్ని నింపుతారు. ప్రజలు అభిమానంతో ఇచ్చిన ‘పవర్ స్టార్’ అనే పేరు పదం చాలా బాగా సరిపోతుందని నా అభిప్రాయం! పవన్‌కళ్యాణ్ లో ఏదో శక్తి ఉంటుంది! ” అని చెప్పుకొచ్చారు. దిగంగన సూర్యవన్శీ పవన్ కళ్యాణ్‌ను ‘లెజెండ్’ అని పిలిచి అతనితో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేసారు. "అతనితో కొన్ని హై-యాక్షన్ సన్నివేశాలు చేయడానికి నేను చాలా ఎదురుచూస్తున్నాని!" తన ఆశను వెళ్లగక్కారు.