
యాంకర్లు రష్మీ, అనసూయ గురించి ఏం చెప్పాలి? బుల్లితెరకు గ్లామర్ డోస్ పెంచి ఎంతోమందికి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇక కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా ఈటీవీలో వచ్చే ఢీ, అప్పుడప్పుడు జబర్దస్త్ లాంటి షోలతో దుమ్మురేపుతున్నాడు. అయితే శేఖర్ మాస్టర్ హీరోగా, అనసూయ, రష్మీలు హీరోయిన్లుగా ఒక సినిమా రానుంది. అది నిజం సినిమా కాదండోయ్! క్యాష్ ప్రోగ్రాంకు విళ్ళతో పాటు హైపర్ ఆది కూడా వెళ్ళటం జరిగింది. ఇంక అక్కడ సుమ కూడా ఉండటంతో మాములు రచ్చ కాదు. అయితే ఏదో టాస్క్ లో భాగంగా సుమ, శేఖర్ మాస్టర్ హీరోగా, వీళ్ళు హీరోయిన్లు సినిమా తీస్తే ఏ టైటిల్ బాగుంటుందని అడగగా.....ఆది వెంటనే "ఆయన వస్తే అంతే" అంటూ డబల్ మీనింగ్ టైటిల్ చెప్పి పంచ్ వేశాడు.