
తెలుగు నటుడు శివ బాలాజీ తన పిల్లలను ఆన్లైన్ తరగతులకు హాజరుకాకుండా తొలిగించారని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ పాఠశాల గురించి ఫిర్యాదు చేయడానికి మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజేత, శివ బాలాజీ తన పిల్లలను ముందస్తు నోటీసు లేకుండా ఆన్లైన్ తరగతుల నుండి తొలగించారని ఆరోపించారు. ఈమేరకు హైదరాబాద్ నగరంలోని మణికొండలోని ప్రైవేట్ పాఠశాలపై హెచ్ఆర్సిలో ఫిర్యాదు నమోదైంది.
ఏవేవో రకరకాల టెస్ట్లు పెట్టి, ప్రభుత్వ అదేశాలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆగస్టు 25న, నా పిల్లలు ఆన్లైన్ తరగతులకు హాజరుకాకుండా తొలిగించబడ్డారని ఈ సమస్యకు సంబంధించి మేము పాఠశాల యాజమాన్యంతో మాట్లాడినప్పుడు, వారు మాతో అసభ్యంగా ప్రవర్తించారు. మిడ్ టర్మ్ పరీక్షల పేరిట పూర్తి ఫీజు చెల్లించాలని వారు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. పూర్తి ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నాకు తగిన రీతిలో స్పందించాలని నేను పాఠశాలను అడుగుతున్నాను. నేను ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్కు తీసుకున్నానని శివ బాలాజీ పేర్కొన్నారు.