
మహేష్ బాబు, రష్మీక జంటగా నటించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో మంచి హైప్ వచ్చింది. దీనికి తోడు విజయశాంతి రీఎంట్రీ, రష్మీక మొదటిసారి మహేష్ తో జతకట్టడం ఇలా అంచనాలను పెంచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇకపోతే అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుండటంతో ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ట్రేడ్ వర్గాలు ఒక అంచనాకు వచ్చేసాయి. ఏపీ, తెలంగాణ కలిపి మొదటిరోజు సుమారు రూ.24కోట్ల వసూళ్లను సరిలేరు నీకెవ్వరు దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.