
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. నిత్యం రామ్ చరణ్, ఫ్యామిలీకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఆరోగ్యానికి, సమాజానికి ఉపయోగపడే సూచనలు, సలహాలను ఇస్తుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీను పోస్ట్ చేసింది. తన గదిలో అద్దం ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటోను పెట్టి " నేను పర్ఫెక్ట్ కాదు కానీ, నేను ఒరిజినల్" అని పోస్ట్ చేసింది. అయితే ఉపాసన పెట్టిన ఫొటోలో నెటిజన్లు ఒక విషయాన్ని గమనించారు. అదే అద్దం ముందున్న ఫోటో ఫ్రెమ్. ఆ ఫోటో ఫ్రెమ్ లో సూపర్ స్టార్ కుమార్తె సితారతో కలిసి ఉపాసన దిగిన ఫోటోను గమనించారు. నారా లోకేష్- నారా బ్రహ్మీని కొడుకు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల్లో మహేష్ కూతురితో దిగిన ఫోటోను ఆమె ఫ్రేమ్ కట్టించుకొని మరి గదిలో పెట్టుకున్నారు. దీంతో ఉపాసన పెట్టిన ఫోటోను క్షణాల్లో లైకులు, షేర్లు కొట్టారు.