
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభం నుండే సంచలనాన్ని సృష్టిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పేర్లు చాలు ఈ ప్రాజెక్టుపై ఆకాశమంత ఎత్తైన అంచనాలు ఏర్పడడానికి. రాజమౌళి సూపర్ విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ను మైంటైన్ చేస్తున్నాడు. అతని చివరి చిత్రం బాహుబలి 1 మరియు 2 అతన్ని పాన్ ఇండియా దర్శకుడిగా మార్చయి. ఇప్పుడు అతని సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడిందని, ప్రస్తుత విడుదల తేదీ జనవరి 8, 2021 అని అందరికీ తెలిసిందే. ఈ చిత్ర ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, తెలుగు హక్కుల కోసం ఇప్పటికే ఒప్పందం పూర్తయింది. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే 215 కోట్ల రూపాయిలు ఒప్పందం కుదిరింది. అంటే, ఈ చిత్రం బాహుబలి 2 కంటే పెద్ద ఎత్తులో వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కులు మునుపెన్నడూ వినని ధరలకు అమ్ముడయ్యాయి. స్టార్ మా డిజిటల్ హక్కులను రూ.260 కోట్లకు కొనుగోలు చేసిందని వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.