
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రియ శరన్ కొన్నేళ్ల పాటు వెండితెరపై ఒక వెలుగు వెలిగింది. అందరి అగ్ర హీరోల సరసన నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు బాలయ్య, చిరంజీవి వంటి సీనియర్ హీరోలకు శ్రీయ మంచి అప్షన్ గా మారింది. 2018లో రష్యిన్ క్రీడాకారుడు ఆండ్రిను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. పెళ్లి తర్వాత శ్రీయ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూనే ఉంది. అయితే అలాంటి శ్రీయ తాజాగా ఓ బంపర్ ఆఫర్ ను తిరస్కరించింది. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన 'అంధాదున్' తెలుగు రీమేక్ లో టబు పాత్రను పోషించమని అడిగితే శ్రీయ నిమిషం కూడా ఆలోచించకుండా నో చెప్పిందట. అందుకు కారణం డేట్స్ లేకనో, ఇండియా రాలేకనో కాదని ఆమె తల్లి కాబోతుందని తెలుస్తోంది.