
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అందమైన మరియు ప్రతిభావంతులైన నటీమణులలో శ్రీయా శరణ్ ఒకరు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ చిత్రం ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. కానీ బాలయ్య చిత్రంలో శ్రీయ శరణ్‌ను తీసుకున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, శ్రీయ మరో సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. డాక్టర్ రాజశేఖర్ తదుపరి చిత్రంకు కూడా శ్రీయ శరణ్ సంతకం చేసినట్లు వినికిడి. డైరెక్టర్ వీరభద్రం ఇటీవల డాక్టర్ రాజశేఖర్ మరియు జీవితలను కలుసుకుని ఒక కథను వివరించారని, కథ నచ్చడంతో తమ అనుమతి ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్, శ్రీయ శరణ్ నటించనున్న ఈ చిత్రం థ్రిల్లర్ నేపథ్యంలో ఒక ప్రత్యేక సంఘటన చుట్టూ తిరుగుతుంది. రాజశేఖర్ చిత్రం రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని జి.వి.ఎన్. శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.