
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత అందనంత ఎత్తుకు ఎదిగాడు. ప్రభాస్ మీద ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ కూడా ఒక కన్నేసి ఉంచింది. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' విడుదలకు సిద్ధం అవుతుండగా....తాజాగా ప్రశాంత్ నీల్ తో 'సలార్' సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక పక్క ప్రభాస్ మరో పక్క కెజిఎఫ్ లాంటి బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ నీల్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు తల్లి పాత్రతో రి ఎంట్రీ ఇచ్చిన శృతి హస్సన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అది ప్రభాస్ ఇమేజ్ ను డామేజ్ చేస్తుందని అభిమానులు కంగారు పడుతున్నారు. మరి అసలు ఇందులో ఎంత వరకు నిజం ఉందొ చూడాలి.