
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' గురించి తాజా సమాచారం నిజమైతే, ఈ చిత్రంలో శ్రుతి హసన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పవన్ మరియు శ్రుతి, బ్లాక్ బస్టర్ అయిన గబ్బర్ సింగ్ లో నటించిన విషయం తెలిసిందే. వీరి కాంబోకు చాలా ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ కాంబో మళ్ళీ వకిల్ సాబ్ ద్వారా త్వరలో అలరించనున్నారు. వకీల్ సాబ్ చిత్రంలో శ్రుతి హసన్ పవన్ భార్యగా కనిపిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వస్తుందని, దీనికి తక్కువ వ్యవధి ఉంటుందని సమాచారం. శ్రుతి హసన్ త్వరలో షూటింగ్లో చేరనున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ చాలా చురుకైన వేగంతో సాగుతోంది. కొన్ని వారాల పాటు నిరంతరం షూటింగ్ చేసిన సినిమా యూనిట్ విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక పవన్, క్రిష్ దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రం