
'ఓ మై ఫ్రెండ్' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆపై వరుస హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది శృతి హస్సన్. మధ్యలో కొన్నాళ్ళు మాత్రం వెండితెరకు దూరంగా ఉండి, మళ్ళీ రవితేజ హీరోగా వచ్చిన 'క్రాక్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఒక సందర్భంలో ఆమె కోరిక ఏంటో చెప్పమంటే....హీరో ప్రభాస్ తో కనీసం చిన్న రోల్ లో నటించే అవకాశం వచ్చిన చాలు, రెమ్యునరేషన్ ను కూడా పట్టించుకోనని చెప్పింది. కానీ జరుగుతున్న సిన్ మాత్రం వేరు. ఆమె కోరిక నెరవేరుతు ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాలో ఈ అమ్మడుకి అవకాశం వచ్చింది. ఆ వచ్చింది కదాని రెమ్యునరేషన్ తగ్గించకపోగా క్రాక్, వకీల్ సాబ్ కంటే ఎక్కువగానే డిమాండ్ చేసింది. సలార్ లో నటించేందుకు కోటి రూపాయిలు అడిగిందట. మేకర్స్ కూడా అందుకు ఒప్పుకుని ఆమెను సినిమాలో భాగం చేసారు. మొత్తానికి శృతి హస్సన్ 'తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే' అనేది తూచా తప్పకుండ పాటిస్తుంది అనుకుంట.