
చాలా రోజుల వెయిటింగ్ తరువాత, చివరకు, అనుష్క శెట్టి మరియు మాధవన్ నటించిన 'నిశ్శబ్దం' యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ విషయానికి వస్తే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ మరియు ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రం హ్యాపీ-గో-లక్కీ జంట అనుష్క మరియు మాధవన్ చుట్టూ తిరుగుతుంది. వారు హాంటెడ్ హౌస్ అని పిలువబడే ఒక విల్లాకు వెళ్ళినప్పుడు వారి జీవితం తలక్రిందులుగా మారుతుంది. అంతేకాదు ఒక దెయ్యం ఉందని నమ్ముతారు. విల్లాలో జరిగిన విషయాలు అనుష్క జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? హాంటెడ్ ఇంటి చుట్టూ ఉన్న రహస్యం ఎలా పరిష్కరించబడుతుంది? అనేది తెరపై చూడాలి. ట్రైలర్ చూస్తుంటే అనుష్క ఎప్పటి లానే తన యాక్టింగ్ తో మెప్పించినట్టు కనిపిస్తోంది. అనుష్కకు పెద్ద డైలాగ్స్ లేనప్పటికీ, కళ్ళతోనే ఎమోషన్స్ ను పడిస్తుంది. మాధవన్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన పాత్రలో జీవించినట్లుగా కనిపిస్తుంది. ఇకపోతే, అంజలీ, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసినట్లు స్పష్టమవుతుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 2వ తేదీన సినిమా రిలీజ్ కానుంది.