
ఈ సంవత్సరం ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలే, కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతుంటే, సినీ పరిశ్రమల్లో ఇదొక విషాదం చోటు చేసుకుంటుంది. ఎంతోమంది ప్రముఖులు కాలం చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ ప్రసిద్ధ గాయకుడు, ఇండియన్ ఐడల్ సీజన్ 2 రన్నరప్ కరుణ్య తల్లి జానకి తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల జానికి శనివారం కన్నుమూశారు. సైదాబాద్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పరిమిత సంఖ్యలో బంధువులు మరియు సన్నిహితులు అంత్యక్రియలకు హాజరయ్యారు. చాలాకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె ఆగస్టు 29న బాలాపూర్ జోన్లోని మీర్పూర్లోని త్రివేణి నగర్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. టాలీవుడ్ లో ఎన్నో ఫెమస్ పాటలు పాడటమే కాక ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు ప్రియా శిష్యుడు. తెలుగు టాలెంట్ గురించి నార్త్ మొత్తం మాట్లాడుకునేలా చేసిన టాలెంటెడ్ సింగర్ కారుణ్య. అలాంటి గొప్ప సింగర్ కు మాతృవియోగం అనేసరికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య ఒక పక్క పాటలు పాడుతూనే సంగీత రియాల్టీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించారు. 2017 లో యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసి సొంతగా పాటలను కంపోజ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నాడు.