
నోయెల్ సేన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ర్యాప్ చేస్తూ యూత్ కు నచ్చే ఆల్బమ్స్ ను కంపోజ్ చేస్తూ కెరియర్ లో మంచి హైప్ లో ఉన్నాడు. గత సంవత్సరం నటి ఈస్టర్ నోరోన్హాను క్రైస్తవ సంప్రదయాల్లో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు. రేపో మాపో పిల్లల గురించి చెప్తారేమోనని అనుకుంటే అందరికి షాక్ ఇస్తూ తాము విడాకులు తీసుకున్నామని ప్రకటించాడు ప్రముఖ సింగర్, ర్యాపర్ నోయెల్. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాడు నోయెల్. “నేను ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకున్నాను. సుదీర్ఘ నిశ్శబ్దం తరువాత, ఈ రోజు నేను ఎస్టర్ నోరోన్హాతో విడాకులను అధికారికంగా ప్రకటిస్తున్నాను. మాకు మా మనస్పర్థలు ఉన్నాయి అందుకే చివరకు ఈ అందమైన రిలేషన్షిప్ ను ముగించాలని నిర్ణయించుకున్నామని" ప్రకటించాడు.