
అన్ని రంగాలతో పోలిస్తే సినీ రంగంలోని సెలెబ్రిటీల జీవితాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుందన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లపై మరింత ఆసక్తి కనుబరుస్తారు. అయితే ఈ ఏడాదిలో పలువురు సినీ ప్రముఖులు రెండో పెళ్లి చేసుకోగా సింగర్ సునీత కూడా రెండో పెళ్లికి సిద్దమైన విషయం విధితమే. భర్త ఎన్నో ఏళ్ల ముందు విడిపోయిన సునీత తాజాగా మ్యాంగో మీడియా ఛానెల్ అధినేత రామ్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే పెళ్లి పెట్టుకున్నప్పటికీ కొన్ని కారణాల కారణంగా అది వాయిదా పడింది. దీంతో రామ్ కు ఎంతో క్లోజ్ అయిన హీరో నితిన్ ప్రై వెడ్డింగ్ పార్టీను హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్ లో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ పార్టీలో కొందరు సినీ ప్రముఖులు, గాయని గాయకులూ సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.